Live

Pic Ad
కేరళ
కేరళలో ఓనమ్ కోలాహలం
కేరళ: కుఫోస్ యూనివర్సిటీలో స్డూడెంట్స్ వేడుకలు
ఉట్టిపడిన  కేరళ సంప్రదాయాలు
వేడుకల్లో తెలుగు విద్యార్థుల హవా

గోల్కొండ న్యూస్ ,  ఇంటర్నెట్ డెస్క్ : 

ఓనం పండుగను పురస్కరించుకొని మలయాళీ సోదర, సోదరీమణులు  ఘనంగా ఓనమ్ పండుగ  జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగానే కేరళ రాష్ట్రంలోని పనాన్ ఘడ్  కొచ్చి లోని కుఫోస్ యూనివర్సిటీలో స్డూటెండ్స్ ఓనమ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అందంగా పూవులతో ముగ్గులు  అలంకరించారు.  అబ్బాయిలు ముండ్ (పంచెలు) కట్టుకుని రాగా.. అమ్మాయిలు కేరళ   సంప్రదాయ  చీరలు కట్టుకుని   వేసుకుని కాలేజీలో హంగామా చేశారు.   మిఠాయిలు పంచుకున్నారు. సాయంత్రం వేళలో వివిధ రకాలైన సరదా ఆటలు ఆడుకున్నారు. యూనివర్సిటీ ప్రోఫెసర్లు డా.అనుగోపీనాథ్, డా. అన్వర్ ఆలీ, డా. ఆర్య , అఖిలాండేశ్వరీ , సేధులక్ష్మీ  ఈ కార్యక్రమంలో పాల్గొని స్టూడెంట్స్ కు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు స్టూడెంట్స్  విష్టువర్ధన్ , శరత్ చంద్ర, చిన్నిక్రిష్ణ, సాగర్, జ్యోతిరామ్,  హరిక్రిష్ణ , మణిదీప్తీ, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ, సాంస్కృతిక వేడుకైన ఈ ఓనం పండుగ వయనాడ్ విపత్తు నుంచి కోలుకుంటోన్న మలయాళీ కుటుంబాల్లో తిరిగి సంతోషాలు నింపాలని తన సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఆకాంక్షించారు.

Last Updated:2024-09-15

అయోధ్య
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ
అయోధ్య: అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు విరాళాల పర్వం కొనసాగుతోంది. సోమవారం బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం రూ.2.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించించారు. రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ. 2.51 కోట్లు విరాళంగా అందించారు. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగివున్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నం అని ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, భార్య నీతా, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా మెహతాతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్, కుమార్తె ఇషా, అల్లుడు ఆనంద్ పిరమాల్ పాల్గొన్నారు.

Last Updated:2024-01-23

ఢిల్లీ
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్
ఢిల్లీ: రాహుల్ గాంధీ రెండో దశ పాదయాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయనీ.. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్లోని ప్యాలెస్ గ్రౌండ్లో యాత్ర నిర్వహించేందుకు మణిపూర్ ప్రభుత్వం నిరాకరించిందనే సమాచారం తమకు అందిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ అన్నారు. కొద్ది రోజుల కిందటే మణిపూర్ పిసిసి చీఫ్ రేఖా చంద్రా గ్రౌండ్ అనుమతి కోసం అక్కడి సిఎస్ కు దరఖాస్తు చేశారు. ఐదు రోజుల్లో వివరాలూ వెల్లడిస్తామని చెప్పారు. కానీ బుధవారం మాత్రం అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారని ఆయన వెల్లడించారు.
తూర్పు నుండి పశ్చిమానికి యాత్రను ప్రారంభించినప్పుడు మణిపూర్ ను తాము ఎలా వదిలివేస్తామన్నారు. మణిపూర్ లో అల్లలు జరిగిన సమయంలోనే రాహుల్ గాంధీ అక్కడ పర్యటించి ప్రశాంతి నెలకొల్పాలని ప్రయత్నాలు చేశారన్నారు. ఇప్పుడు తామేమి రాజకీయాలు చేయడం కోసం వెళ్లడం లేదని విషయాన్ని గుర్తు చేశారు. తమ అభ్యర్థనను నిరాకరించి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తామని.. ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నామని విషయాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు రాహుల్ గాంధీ యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభించాల్సి ఉంది.

Last Updated:2024-01-10

కరీంనగర్
మన సర్వపిండిని మెచ్చుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
కరీంనగర్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మన కరీంనగర్ స్పెషల్ వంటకం అయిన సర్వపిండి భలే నచ్చింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనేందకు కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన ఆయన మంగళవారం సాయంత్రం మానకొండురు నియోజకవర్గంలోని కొండ పలక ఎంపీటీసీ, బీజేపీ కార్యకర్త గుర్రాల వెంకటరెడ్డి నివాసానికి వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తో కలిసి వెంకట రెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితిపై ఆరా తీశారు. వారితో కలిసి టీ తాగారు. కరీంనగర్ స్పెషల్ అయిన సర్వపిండిని బండి సంజయ్ తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరగించారు. సర్వపిండి చాాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రాకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. అందరితో కాసేపు కలివిడిగా గడిపారు.

Last Updated:2024-01-09

హర్యానా
ఫ్రొఫెసర్ సెక్స్ వల్ హరాష్ మెంట్
హర్యానా: హరియాణాలోని సిర్సాలో చౌదరీ దేవిలాల్ వర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాని 500 మంది అమ్మాయిలు ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది. ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు గవర్నర్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వాళ్లు రాసిన లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే మొదటిసారి కాదని.. ఇలా లేఖలు రాయడం నాలుగోసారి.

Last Updated:2024-01-09

జనగామ
అయోధ్యలో మన చిందు లాట
జనగామ: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది ఆయోధ్య నగరం. ఆ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కళారత్న, హంస అవార్డు గ్రహిత గడ్డం సమ్మయ్య బృందానికి అహ్వానం అందింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలను యూపీలోని ఆయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనలు ఈ నెల 14 నుంచి 19 వరకు ఉంటాయి. మొత్తం 15 మంది కళాకారులతో కూడిన బృందానికి అన్ని రకాల వసతులు అక్కడే ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య బృందం దేశ విదేశాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో ఏండ్ల నుంచి చిందు యక్షగాన కళారూపాన్ని నమ్ముుకుని కొన్ని కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైమ్ నుంచి గ్రామాల్లో మద్యపాన నిషేధంపై ఎన్నో కళారూపాలు ప్రదర్శించారు. ఆ తరవాత రాష్ట్రం అంతటా తిరిగి కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత పెంపు వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అటు ప్రజల.. ఇటు పాలకుల మన్ననలను పొందారు. గడిచిన తెలంగాణ ప్రభుత్వంలోని పలు పథకాల మీద గ్రామాల్లో అవగాహన కోసం ప్రదర్శనిలిచ్చారు. మారుతున్న కాలానుగుణంగా వస్తున్న కార్యక్రమాలకు కొత్తగా ప్రజలను ఆకట్టుకునేలా పాటలు, స్క్రిప్టు రాసుకుని జనరంజకంగా తమ కళారూపాలను కొనసాగిస్తున్నారు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చినా.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వనం అందడం.. అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం పూర్వజన్మలో చేసిన పుణ్యమేనని గడ్డం సమ్మయ్య తెలిపారు.
గోల్కొండ న్యూస్
జనగామ

Last Updated:2024-01-05

హైదరాబాద్
జగన్.. కేసీఆర్ భేటి ఆసక్తికరం
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్ ను సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూలగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. రామారావు కలిసిన వెంటనే జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ ను కలిసి పూల బొకే ఇచ్చి.. కండువా కప్పారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏపీ , తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు.. చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశాను ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా జగన్ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రోజే ఇక్కడ కేసీఆర్ తో భేటి కావడం మరింత ఆసక్తికరంగా మారింది.

Last Updated:2024-01-05

ఇంఫాల్
మణిపూర్ లో మళ్లీ వాయిలెన్స్ : 4గురు దుర్మరణం
ఇంఫాల్: మణిపూర్ లో మళ్లీ హింసకు తాండవం చేస్తుంది. కొత్త సంవత్సరం మొట్టమొదటి రోజే ఒక గ్రూప్ జరిపిన కాల్పుల్లో 4 గురు దుర్మరణం చెందారు. వీళ్లతో పాటు చాలా మంది గాయపడ్డారు. తౌబాల్ జిల్లాలోని లిలాంగ్‌లో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడ్డ దుండగుల వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టడంతో అక్కడ హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో మళ్లా కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది. తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను పెట్టినట్లు అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పలు జరిపారని, దోపిడీ కోసం వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. దుండగుల సమూహం ఓ స్థానిక వ్యక్తితో మాట్లాడుతుండగా వారి మధ్య గొడవ జరిగిందని, కొద్దిసేపటికి అందరిపై కాల్పులు జరిపారని ఓ వ్యక్తి వెల్లడించారు.
ఈ హింసాత్మక ఘటనపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనను ఆయన ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన వీడియో మెసేజ్ ను కూడా విడుదల చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. నేరస్థులను గుర్తించేందుకు స్థానికులే మేలు చేయగలరని.. వారంతా ప్రభుత్వానికి సహాయం చేయాలంటూ లిలాంగ్ ప్రజలను ఆయన కోరారు.
ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు మెరుగవుతున్న టైమ్ లో జరిగిన ఈ హింసాత్మక ఘటనపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం బీరెన్ సింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. గతేడాది మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింస 2023లో జరిగిన ముఖ్య ఘటనల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో చోటుచేసుకున్న తీవ్ర హింసలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మణిపూర్ మంటలు ఇంకా ఎప్పుడు చల్లారుతాయో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది.

Last Updated:2024-01-02

అస్సాం
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది
అస్సాం : ఉల్ఫాతో కేంద్ర, అస్సాం ప్రభుత్వాలు కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు, ఈ ఒప్పందం రాష్ట్రంలో శాశ్వత ప్రగతికి బాటలు వేస్తుందని అన్నారు. కొన్నేళ్లుగా ఉల్ఫాతో పలు దఫాలుగా చర్చలు జరగడంతోనే అది శాంతి ఒప్పందానికి దారితీసింది. 1979 నుండి, అస్సాం ఆందోళనలో సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఉల్ఫాతో చర్చలు జరిపి మూసివేతకు హోం మంత్రిత్వ శాఖ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. దీంతో అస్సాంలో శాంతి నెలకొననుంది.

Last Updated:2023-12-30

తమిళనాడు
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం
తమిళనాడు: తమిళనాడులోని పుదుకోట్టైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. డీసీఎం వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated:2023-12-30

మహారాష్ట్ర
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు
మహారాష్ట్ర : శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర మాంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌ఘడ్‌లోని తమ్హాని ఘాట్ ప్రాంతంలో ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై విచారణ చేస్తున్నట్లు రాయగడ ఎస్పీ సోమనాథ్ ఘర్గే వెల్లడించారు.

Last Updated:2023-12-30

యూపీ
2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు
యూపీ : 2030 నాటికి దేశంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 200కి చేరుకుంటుందని.. రాబోయే 10 ఏండ్లలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యంపై, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు రాష్ట్రంలో 9 అయ్యాయన్నారు. 10వ విమనాశ్రయం శనివారం ప్రారంభించుకోబోతున్నామన్నారు. వచ్చే ఏడాది నాటికి , యూపీ మరో 9 విమానాశ్రయాలను ఏర్పాటవుతాయన్నారు. మొత్తంగా 19కి చేరుకుంటుందన్నారు. రెండు నెలల తర్వాత అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి , చిత్రకూట్‌లలో ఒక్కొక్కటిగా ఐదు విమానాశ్రయాలు ప్రారంభించబడతాయన్నారు. తాము దేశంలో 75 కొత్త విమానాశ్రయాలను నిర్మించామని.. గత 9 ఏండ్లలో ఈ సంఖ్య 149కి చేరుకుందని వివరించారు.

Last Updated:2023-12-29

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

ట్రెండింగ్
Updated:2023-12-30
నేడు మోడీ యూపీ పర్యటన        |       287 Reading
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       313 Reading
Updated:2023-12-30
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది        |       464 Reading
Updated:2023-12-28
నటుడు విజయ్ కాంత్ కన్నుమూత        |       343 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       191 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహలం        |       125 Reading
Updated:2023-12-26
కరోనా కేసులు పెరుగుతున్నయ్        |       481 Reading
Updated:2023-12-25
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...        |       272 Reading
చరిత్రలో ఈరోజు [Feb-06 ]

1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.,
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
2023 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.
2023: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

WhatsApp